ఇది నోట్ల రద్దు ఎఫెక్టేనా..? | Sakshi
Sakshi News home page

ఇది నోట్ల రద్దు ఎఫెక్టేనా..?

Published Wed, Oct 11 2017 6:15 PM

Direct tax collections jump 16% to Rs 3.86 lakh core  - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు, జీఎస్‌టీతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్న విమర్శలు వెల్లువెత్తుతుంటే ప్రభుత్వం చెబుతున్నట్టు ప్రత్యక్ష పన్ను వసూళ్లు మాత్రం గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్‌-సెప్టెంబర్‌లో ప్రత్యక్ష పన్నులు గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 16 శాతం వృద్ధితో రూ 3.86 లక్షల కోట్లకు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ వసూళ్లలో పెరుగదల ఫలితంగా ప్రత్యక్ష పన్నులు ప్రోత్సాహకరంగా వసూలయ్యాయని అధికారులు చెప్పారు. సెప్టెంబర్‌ వరకూ  అడ్వాన్స్‌ ట్యాక్స్‌ వసూళ్లు రూ 1.77 లక్షల కోట్లకు చేరాయి. కార్పొరేట్‌ ఆదాయ పన్ను ముందస్తు పన్నులో 8.1 శాతం వృద్ధి నమోదవగా, వ్యక్తిగత ఆదాయ పన్ను అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులు 30.1 శాతం మేర పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబర్‌లో రూ 79,660 కోట్ల రిఫండ్‌లను చెల్లించారు. ఇక ఏప్రిల్‌-సెప్టెంబర్‌లో స్థూల ప్రత్యక్ష పన్నులు 10.3 శాతం పెరిగి రూ 4.66 లక్షల కోట్లు వసూలయ్యాయి.

Advertisement
Advertisement